సంక్రాంతి రేసుకి సై..

 సంక్రాంతి రేసుకి సై..రాబోయే సంక్రాంతి రేసు మరింత రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో బాలకృష్ణ 109వ చిత్రం, రామ్‌చరణ్‌, దర్శకుడు శంకర్‌ల ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలు ఉన్నాయి. ఈ పోటీకి మరింత హీట్‌ పెంచుతూ వెంకటేష్‌ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మేకర్స్‌ శనివారం అధికారికంగా ప్రకటించారు. వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి కలయికలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ఇప్పటికే దాదాపు 90% షూటింగ్‌ పార్ట్‌ని పూర్తి చేసుకుంది. మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌కి సంబంధించి డబ్బింగ్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో డబ్బింగ్‌ స్టూడియో నుంచి రిలీజ్‌ చేసిన వీడియో ఓ వేడుక వాతావరణాన్ని చూపిస్తోంది. వెంకటేష్‌, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్‌, కుటుంబంతో పాటు అందరూ ఉత్సాహంగా ఈ వీడియోలో కనిపించారు. ‘ఎఫ్‌2’, ‘ఎఫ్‌3’ వంటి బ్లాక్‌బస్టర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తర్వాత వెంకీ, అనిల్‌రావిపూడి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పాటు ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉండటంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయని చిత్ర బృందం తెలిపింది. దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్న ఈ గ్రిప్పింగ్‌ ట్రైయాంగిల్‌ క్రైమ్‌ డ్రామాలో వెంకటేష్‌ ఎక్స్‌గర్ల్‌ ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి  కనిపించనుంది. ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్‌, సాయికుమార్‌, నరేష్‌, వి.టి.గణేష్‌, మురళీధర్‌ గౌడ్‌, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్‌, ఆనంద్‌ రాజ్‌, చైతన్య జొన్నలగడ్డ,  మహేష్‌ బాలరాజ్‌, ప్రదీప్‌ కాబ్రా, చిట్టి తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి, సమర్పణ: దిల్‌ రాజు, నిర్మాత: శిరీష్‌, సంగీతం: భీమ్స్‌  సిసిరోలియో, డీవోపీ: సమీర్‌ రెడ్డి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటర్‌: తమ్మిరాజు, కో- రైటర్స్‌: ఎస్‌. కష్ణ, జి ఆదినారాయణ, యాక్షన్‌ డైరెక్టర్‌: వి.వెంకట్‌, వీఎఫ్‌ఎక్స్‌  :నరేంద్ర లోగిసా.