
మోపాల్ మండలంలోని బోర్గం పి సొసైటీ చైర్మన్, బ్యాంక్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కేంద్ర బ్యాంక్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. తమ సొసైటీ చైర్మన్ కి బ్యాంక్ వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడంతో సొసైటీ పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సొసైటీ చైర్మన్గా రైతులకు ఎల్లప్పుడూ సేవ చేస్తూ, ఎటువంటి అవినీతికి తావు లేకుండా నిజాయితీపరుడైనటువంటి వ్యక్తికి ఈరోజు ఉన్నత పదవి లభించడం మా రైతులందరికీ ఎంతో సంతోషకరమని వారు తెలిపారు.