సౌత్ ఇండియా యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు హుస్నాబాద్ కబడ్డీ క్లబ్ నుండి ముగ్గురు విద్యార్థుల ఎంపికైనట్లు కబడ్డీ కోచ్ మడక కృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న కరీంనగర్ శాతావాహన యూనివర్సిటీలో జరిగిన కబడ్డీ పోటీలలో గడిపె సిద్దు, ఎండీ ఆల్ఫాజ్, కోయిలకరి శ్రీశైలం ప్రతిభ కనబరచి ఎంపిక కావడం హర్షినియమని అన్నారు. చెన్నై లో ఈ నెల 30 నుండి జరగబోయే సౌత్ ఇండియా కబడ్డీ పోటీలకు శాతవాహన యూనివర్సిటీ టీంకి గడిపే సిద్దు కెప్టెన్ గా ప్రాతినిద్యం వహిస్తున్నాడని పేర్కొన్నారు. వీరి ఎంపిక పట్ల బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, గ్రంధాలయ శాఖ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అభినందనలు తెలిపారు.