నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ లో గుర్తు తెలియని దుండగులు తోపుడు బండ్లకు నిప్పు పెట్టి దహనం చేశారు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగు లోకి వచ్చింది. పండ్లను, కురగాయాలను విక్రయించే చిరు వ్యాపారులు తమ తోపుడు బండ్లను స్థానికంగా శంకర్ భవన్ స్కూల్ వద్ద రాత్రిపూట నిలిపి ఉంచుతున్నారు. అదివారం రాత్రి అగంతకులు బండ్లకు నిప్పు పెట్టి కాల్చేశారు. ఉదయం వ్యాపారులు శివాజీనగర్ వద్ద తమకు ఉపాధి ఇచ్చే పండ్ల బండ్లను కాల్చివేశారు అని తెలిసి కన్నీరుమున్నీరు అయ్యారు. స్థానికంగా ఉన్న సీసీ కెమోరాలను పరిశీలిస్తే దుండగులను గుర్తించే విలుంది.