
మండలంలోని చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గ్రామానికి చెందిన పుప్పాల నవీన్ రూ. 25వేల విలువైన కంప్యూటర్ సేట్ ను విరాళంగా అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి ఎన్. ఆంధ్రయ్య సోమవారం తెలిపారు. నవీన్ కుమారుడు పుప్పాల వైభవ్ ఇదే పాఠశాలలో ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్నట్లు ఆయన తెలిపారు. నవీన్ కూడా 1996- 97 బ్యాచ్ లో పదవ తరగతి ఇక్కడే చదివినట్లు ఎంఈఓ వివరించారు. విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలకు రూపాయి 25వేల విలువైన కంప్యూటర్ అందించిన పుప్పాల నవీన్ కు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల తరఫున ఎంఈఓ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీఆర్పీలు అంజయ్య, ఫిజికల్ డైరెక్టర్ నాగేష్, ఉపాధ్యాయ బృందం సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.