నవతెలంగాణ-గోవిందరావుపేట
ఏ రుణం ఎత్తుకున్న కమిషన్ ఇవ్వాల్సిందే ప్రశ్నిస్తే గ్రూప్ నుంచి తీసేస్తారు తనకు నచ్చిన వారిని మాట వినే వారే గ్రూప్ లీడర్ ఇతర ప్రాంతాల్లో ఉన్న విదేశాల్లో ఉన్న రుణం పొందవచ్చు కనకదుర్గ మహిళా సమాఖ్య మండల కేంద్రంలో మహిళ సంఘాల కార్యాలయం. మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ సమాఖ్య 31 గ్రామ సంఘాలు (వి ఓ)ఉండగా మండల వ్యాప్తంగా 731 స్వయం సహాయ సంఘాలు (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్) ఉండగా 7506 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీటి ఆర్గనైజేషన్ చేయడానికి 31 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ( వివోఏ) లు, ముగ్గురు సీసీలు , ఒక అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ లు ఉన్నారు. కాగా మిగతా వారిలో ఒకరు అకౌంటెంట్ మరొకరు కంప్యూటర్ ఆపరేటర్ మరొకరు అటెండర్ విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఒక్కొక్క వివో ఏ సుమారు 30 మహిళా సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు అత్యధికంగా అక్షరాస్యత లేకపోవడం వల్ల వివో ఏలు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోందనీ. ఏ రుణం ఎత్తుకున్న వెయ్యికి ఇంత చొప్పున కమిషన్లు ముట్ట చెప్పాల్సిందేనని. లేకపోతే సహించరు ఎదురు తిరిగి మాట్లాడిన వారిని గ్రూపు నుంచి నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు. వారి రుణం ఉన్నప్పటికిని గ్రూపు నుంచి తీసేయించి నెలవారీగా రుణం వాయిదాలు కట్టించుకుంటారు వారి స్థానంలో డబ్బులు తీసుకుని మరొకరిని సభ్యులుగా చేర్చుకుంటారు. కొన్ని గ్రామాల్లో సుమారు పది లక్షల రుణం ఇచ్చినట్లయితే కొన్ని గ్రామాల్లో 6వెలు మరికొన్ని గ్రామాల్లో రుణ పరిమితిని బట్టి 10 నుండి 15 వేల రూపాయలు కమిషన్ల రూపంలో తీసుకుంటున్నారని అందరి అధికారులకు మామూలు ఇవ్వాల్సి ఉంటుందని లేకపోతే నిన్ను చూసి రుణమిచ్చారా అని ఎదురు ప్రశ్నిస్తారనీ ఆయా గ్రామాల మహిళా సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు. వారికి నచ్చిన గ్రూపుకు రుణం ఇవ్వాలంటే సభ్యుల ఒకరిద్దరూ దూర ప్రాంతాల్లో అనగా పట్టణ ప్రాంతాల్లో విదేశాల్లో ఉన్నా సరే వారి ఫోటోలు మార్ఫింగ్ చేసి సంతకాలు ఫోర్జరీ చేసి మరి రుణాలు ఎత్తుకున్న సందర్భాలు ఉన్నాయని సభ్యులు తెలుపుతున్నారు. అసలు ఏ రుణం ఎంత ఇస్తున్నారు ప్రతి నెల ఎంత చెల్లించాలి అనే వివరాలు కూడా చెప్పరని, ఒకసారి రుణం పూర్తయిందని మరి రెండు నెలల తర్వాత మరొక నెల వాయిదా చెల్లించాలని వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయని పావలా వడ్డీ లు తిరిగి జమ అయినయా కాలేదా తెలియని పరిస్థితి నెలకొన్నాయని, లెక్కలు అడిగితే నమ్మకం లేదా అని దబాయి ఇస్తారని అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రుణాలు వేరువేరుగా వస్తున్నాయని వాటిని వివరించాల్సిన వివో ఏలు వివరించకుండా డబ్బులు అవసరం లేని వారి రుణాలు వారే ఎత్తుకొని ఇతర వ్యాపారాలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని కొందరు నట్టేట ముంచితే లబోదిబోమటూ ఇప్పటికీ నెల నెల వాయిదాలు చెల్లిస్తున్నామని పలువురు మహిళా సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. గతంలో మైనర్లను కూడా సంఘాలను సభ్యులుగా చేర్చుకుని వారి పేరు మీద రుణాలు పొంది గొడవలు అయి డి ఆర్ డి ఏ కార్యాలయం వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. మహిళకు మహిలే శత్రువు అన్న విధంగా సభ్యులు అభివృద్ధిని ఆకాంక్షించాల్సిందే పోయి సభ్యుల ఆర్థిక అభివృద్ధిని అడ్డుకునే విధంగా మోసపూరితంగా ప్రవర్తించడం మంచిది కాదని కొందరు మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై డిఆర్డిఏ జిల్లా అధికారి సంపత్ రావు ను నవతెలంగాణ సంప్రదించగా ఖచ్చితమైన సమాచారం ఆధారం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. గతంలో అధికారులు విచారణకు వెళితే వారిలో వారే కాంప్రమైజ్ కావడం వల్ల సంబంధిత వివో ఏ లపై చర్యలు చేపట్ట లేకపోయామని అన్నారు. ఎవరైనా స్పష్టమైన సమాచారంతో వస్తే విచారించి చర్యలు చేపడతామని అన్నారు.
ఆధారాలతో దొరికితే చర్యలు తప్పవు
ఏపీఎం నాగేశ్వరరావు
ఈ విషయం అక్కడక్కడ అప్పుడప్పుడు అనుకుంటున్నారు కానీ మా వరకు స్పష్టత రావడం లేదు. ఒకటి రెండు సార్లు వచ్చిన మేము విచారణకు వెళ్లేసరికి నిలబడడం లేదు. ఇప్పటికైనా మాకు అన్యాయం జరిగింది అని మహిళ సంఘాల సభ్యులు వస్తే తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తెలిపారు. ధైర్యంగా కార్యాలయానికి వచ్చి గాని ఫోన్ ద్వారా గాని వారికి జరిగిన అన్యాయాన్ని వివరించవచ్చని అన్నారు. వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు ఉంటాయని అన్నారు.
మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలి.
మంచాల కవిత ఐద్వా ములుగు జిల్లా ఉపాధ్యక్షురాలు
మహిళా సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధికి సమాఖ్య సిబ్బంది తోడ్పాటు అందించాలి. కానీ వారి అమాయకత్వాన్ని అక్షరాస్యతను ఆసరా చేసుకుని ఆర్థిక దోపిడీ చేయడం సమంజసం కాదు. అధికారులు కౌన్సిలింగ్ సమావేశాల ద్వారా అవగాహన కల్పించి, సంఘటనలు ప్రనవరావృతం కాకుండా చూసుకోవాలి, తప్పు చేసిన వారిపై శిక్ష గట్టిగా అమలు జరిగితే ఇకముందు అలాంటివి చేయడానికి మిగతావారు భయపడతారు కావున విచారణ జరిపి వాస్తవం అయితే చర్యలు చేపట్టాలి. అందరూ ఒక కుటుంబంలా మసలుకోవాలి, అసమానతలు రాకుండా చూసుకోవాలి.