– అందుబాటులో లేకపోవడంతో
– ఇంటి గేటుకు అతికించిన పోలీసులు
నవతెలంగాణ-మియాపూర్/శంకర్‌పల్లి
జన్వాడ ఫామ్ హౌస్ యజమాని కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 35(3) సెక్షన్ ప్రకారం ఆయనకు నోటీసులు జారీ చేసినట్టు మోకిల పోలీసులు తెలిపారు. రాజ్‌పాకాల.. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో నగరంలోని రాయదుర్గంలో ఓరియన్ విల్లాస్‌లోని ఆయన నివాసానికి నోటీసును అతికించినట్టు పోలీసులు తెలిపారు.