బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

Financial assistance to the affected familyనవతెలంగాణ – రామారెడ్డి
 మండలంలోని రెడ్డి పేట గ్రామానికి చెందిన బొర్రా  బాలరాజ్ అనారోగ్యంతో మృతిచెందగా, బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదని తెలుసుకున్న నారెడ్డి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాడ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రఘోత్తమ రెడ్డి, బండి ప్రవీణ్, చింతకుంట కిషన్, ఆంజనేయులు, రంజిత్, మహేష్, విజయ్, శ్రీకాంత్, రాజు, గర్గుల్ రంజిత్, కొయ్యల శేఖర్, బద్ది సతీష్, తదితరులు పాల్గొన్నారు.