కార్మికుల కర్షకుల నవ్వులే

The laughter of the workersదీపావళి వెండి వెలుగులవుతాయి
కర్షకుడి దిగుబడి
కార్మికుడి కూలిడబ్బులు
చిచ్చుబుడ్డిలా నిండుగా చిమ్మితేనే
మొహాలు మతాబుల్లా వెలిగిపోతాయి
అనూహ్య విలయాలు
పనులు దొరకని కరువులు
మేఘమల్లే కమ్మితే
బతుకులు తడిసిన టపాసులవుతాయి
రైతుకి గిట్టుబాటు ధర
శ్రామికుడికి శ్రమకు తగ్గ ధర
దొరికిన రోజు వాళ్ల
జీవితాలు కాకరపువ్వొత్తుల్లా వెలిగిపోతాయి
రైతులు మట్టినే నమ్ముకున్నా
కార్మికులు శ్రమనే అమ్ముకున్నా
వాళ్ల కుటుంబాలు
మూడు పూటలా అన్నం
తినగలిగే రోజు
దేశ భవిష్యత్తు తారాజువ్వల్లా
అభివృద్ధి నింగిలోకి
దూసుకుపోతాయి..!!
– బి.పురుషోత్తమ్‌,
9949800253