తాళ్ళ రాంపూర్ పీఏసీఎస్ లో శుక్రవారం వరి కొనుగోలు కేంద్రాన్ని సంఘ అధ్యక్షులు పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యత ప్రమాణాలు పాటించి, వరికి మద్దతు ధర పొందవచ్చని అన్నారు. గ్రేడ్ ‘ఏ” కు క్వింటాలుకు 2320, గ్రేడ్ ‘బి”కి 2300 రూపాయలు ఉందని తెలిపారు. ఇందులో భాగంగా ఏఎంసీ కమ్మర్ పల్లి డైరెక్టర్ కొరిపెల్లి లింగారెడ్డి,మండల వ్యవసాయాధికారి హరీష్,ఏర్గట్ల పీఏసీఎస్ చైర్మన్ బర్మ చిన్న నర్సయ్య, సంఘ డైరెక్టర్లు సోమ దేవరెడ్డి,దేశబోయిన సంజీవ్,బద్దం రవీంధర్,ఏర్గట్ల ఎన్డీసీసీబి మేనేజర్ దేవేంధర్,ఏఈఓ సాయి సచిన్,రైతులు పాల్గొన్నారు.