నవ తెలంగాణ-ఆర్మూర్
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభాకర్ రావు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (S.P)గా పదోన్నతిగా వచ్చిన సందర్భంగా సోమవారం పట్టణానికి చెందిన సామాజిక సేవకులు పట్వారీ తులసి కుమార్ ఎసిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి, జ్ఞాపకని అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ పట్వారి తులసి స్వచ్ఛందంగా చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. పట్వారి తులసి మాట్లాడుతూ ఆర్మూర్లో ఎసిపి గా బాధ్యతలు చేపట్టి ప్రజలకు రక్షణగా నిలుస్తూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పదోన్నతి సాధించడం ఆర్మూర్ ప్రజలకు అభినందనీయమని స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సందీప్ , కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.