హుస్నాబాద్ పట్టణ తొపుడు బండ్ల సంఘం వ్యవస్థాపకులు, సీపీఐ సినీయర్ నాయకుడు మేకల మల్లన్న యాదవ్ 11వ వర్ధంతిని శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్ నాయకులతో
కలిసి పుల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేకల మల్లన్న యాదవ్ నమ్మిన సిద్ధాంతం కోసం పేదల రాజ్యం స్దాపనే ద్యేయంగా పనిచేసిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడని అన్నారు. పేదల రాజ్యం కోసం సమాజంలో జరుగుతున్న పాలకుల పనితీరుపై నేటి యువత రైతులు కూలీలు శ్రమజీవులు ఏకమై ఉద్యమించాలని గడిపె మల్లేశ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజీవరెడ్డి, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజు కుమార్, సీపీఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి, ఎండి అక్బర్, దండుగుల ఎల్లయ్య, ఎండి అంకుశావళి, పిసర వెంకటయ్య, చుక్క తిరుపతి తదితరులు పాల్గొన్నారు.