కుల గణనపై శిక్షణ తరగతి

Training Class on Caste Enumerationనవతెలంగాణ – రాయపర్తి
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఆరవ తేదీ నుంచి నిర్వహించనున్న కుల గణనపై శుక్రవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శిక్షణ తరగది నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్ మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అంశాలపై క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల సామాజిక, ఆర్థిక, ఆదాయ, విద్య, రాజకీయ స్థితిగతుల వివరాలన్నీంటిని సర్వేలో నమోదు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ మేరకు పార్ట్‌ 1, పార్ట్‌ 2లో 75 ప్రశ్నలను రూపొందించిన్నట్లు ఈ సర్వే ఫారం మొత్తం 7 పేజీల్లో ఉంటాయి అన్నారు.  కుటుంబ యజమాని, వ్యక్తిగత వివరాలు నమోదు, మతం, సామాజిక వర్గం, కులం, ఉప కులం, మాతృభాష, వయసు, వైవాహిక పరిస్థితి, పాఠశాల వివరాలు, విద్యార్హతలు, ఉద్యోగం, ఉపాధి, కుల వృత్తి, వార్షిక ఆదాయం, ఐటీ రిటర్న్స్‌, స్థిరాస్తులు, ధరణి పాస్‌ బుక్‌ నంబర్‌, రిజర్వేషన్ల వల్ల పొందిన ప్రయోజనాలు, గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి ఏమైనా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వివరాలు, తదితర అంశాలను నమోదు చేయాల్సి ఉంటుంది అని వివరించారు. తీసుకున్న రుణాలు, పశుసంపద, స్థిరాస్తి, చరాస్తి, రుషన్‌ కార్డు నంబర్‌, గృహం రకం, మరుగుదొడ్డి, గ్యాస్‌ కనెక్షన్‌ నంబర్‌, తదితర వివరాలను నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. సర్వే కోసం 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించనున్నాట్లు తెలిపారు. ఒక ఎన్యూమనరేటర్‌ పరిధిని ఒక బ్లాక్‌గా నిర్ణయించి పది బ్లాక్‌లకు కలిసి ఒక సూపర్‌వైజర్‌ను నియమించనునాట్లు ఉపోద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ ప్రకాష్, ఏఓ వీరభద్రం, ఏపీఎం కిరణ్ కుమార్, ఐసీడీస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.