సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్ లో ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ జగ్రామ్ అంతర్వేది మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ 565 సంస్థానాలను దేశంలో విలీనం చేసి దేశాన్ని సమైక్యంగా నిలిపారని అన్నారు. అలాగే ఎన్ సి సి కేడెట్లతో కలిసి ఏకతా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు అరుణ్ కుమార్, సంతోష్ కుమార్, చక్రవర్తి, రమాకాంత్ గౌడ్, శ్రీధరాదేవి, మంజుల, జోత్స్న, పాల్గొన్నారు
మాదకద్రవ్యాల దుష్ఫలితాలపై అవగాహన
తెలంగాణ ప్రభుత్వ కళాశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ లో మాదకద్రవ్యాల వినియోగం దుష్ఫలితాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ జగ్రామ్ అంతర్వేది మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించారు. డ్రగ్స్ జీవితాలను నాశనం చేస్తుందని, విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా 1908 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో యాంటీ డ్రగ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె రమేశ్ అధ్యాపకులు అరుణ్ కుమార్, సంతోష్ కుమార్, చక్రవర్తి, రమాకాంత్, శ్రీధరాదేవి, మంజుల, జోత్స్న, జ్ఞానేశ్వర్, రాజ్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు.