నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరగనున్న 67వ కామన్వెల్త్ పార్లమెంట్ కాన్ఫరెన్స్ (సీపీసీ)లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యుల బృందం వెళ్లనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులు శనివారం రాత్రికి బయలుదేరుతారు. అనంతరం స్టడీ టూర్లో భాగంగా న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో బృందం పర్యటించనుంది. పర్యటన ముగించుకుని వారు ఈనెల 16న హైదరాబాద్కు చేరుకుంటారు.