మండల కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కార్యాలయంలో ఈనెల 9న ఆర్మూర్ పట్టణ కేంద్రంలో దివంగత కామ్రేడ్ దుర్గంపూడి వెంకట కృష్ణ విగ్రహావిష్కరణ, సభ గోడప్రతులను శనివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా నిజామాబాద్ జిల్లా నాయకులు సారా సురేష్ మాట్లాడుతూ దాదాపు 53 సంవత్సరాలు పేద ప్రజల కోసం అలుపేరుగాని పోరాటం చేసిన నాయకుడు కామ్రేడ్ దుర్గంపూడి వెంకట కృష్ణ అని కొనియాడారు. భారత దేశంలో విప్లవం సిద్ధించాలంటే ప్రజాపంథా మార్గమే సరైన మార్గమని అనేక పుస్తకాలు రాసి విప్లవకారులందరికీ ఆదర్శమూర్తిగా నిలిచిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ డీవీ కృష్ణ అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా విప్లవకారులందరు మారాలని పరిస్థితులకు భిన్నంగా ఉంటే విప్లవం తీసుకురాలేమని ఈ దేశంలో మార్పు రాదని గ్రహించిన వ్యక్తి కామ్రేడ్ డీవీకే అని పేర్కొన్నారు. విప్లవద్యం ముందుకు పోవాలంటే దుర్గంపూడి వెంకటకృష్ణ చూపిన మార్గమే సరైన మార్గమన్నారు. ఈనెల 9న ఆర్మూర్ పట్టణ కేంద్రంలో నిర్వహించనున్న దుర్గంపూడి వెంకట కృష్ణ విగ్రహావిష్కరణ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) ప్రజా పంథా మండల కార్యదర్శి బషీరి అశోక్, మండల నాయకులు వి. సత్తెమ్మ, ఉట్నూర్ అశోక్, టి.బాలకిషన్, ఎస్. గంగారాం, టి. బాలయ్య, భూమన్న, తదితరులు పాల్గొన్నారు.