
నవతెలంగాణ – రెంజల్
శనివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు ఏర్పడడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధాన రోడ్డుపై ధాన్యం ఆరబెట్టగా.. వాహనదారులు అతి నెమ్మదిగా వాహనాలను నడిపించాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డుపై పొగ మంచు ఏర్పడడంతో ఎదుటి నుండి వచ్చే వాహనాల లైట్లు పొగ మంచు కప్పడంతో చిన్నవిగా కనబడ డం జరిగింది. శీతాకాలంలో మొదటిసారిగా ఈ పొగ మంచు ఏర్పడడం జరిగింది.