బీసీ, బీసీల ఉప కులాలకు న్యాయం చేయాలి

BC and sub-castes of BC should be given justice– రాష్ట్ర బీసీ కమిషన్, చైర్మన్ కు వినతి 
– జాతీయ బీసీ సంక్షేమ సంఘం
నవతెలంగాణ – మల్హర్ రావు
బిసి,బిసి ఉప కులాలకు న్యాయం చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం భూపాలపల్లి జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య నాయీ,కాటారం డివిజన్ ఇంచార్జి ఆత్మకూరి స్వామి యాదవ్ లు శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషనర్ & చెర్మన్ జీ నిరంజన్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు బీసీ జనగాననతో పాటు కులగనన చేసి ఏ,బి,సి,డి లుగా చట్టసభలలో మరియు స్థానిక సంస్థల్లో, ఉద్యోగ విద్య నియామకాల్లో జనాభా తమాషా ప్రకారముగా రిజర్వేషన్ లు కల్పించాలని కోరారు.బీసీ కానీ కులం రెడ్డిగాండ్లు మాయొక్క ప్రాంతములో (గాండ్ల) కులం పేరుతో బీసీ సర్టిఫికెట్స్ పొందడానికి అయొక్క కులం వారు ప్రయత్నం చేస్తున్నారు కావున వారిని బీసీ కులాల జాబితలో చేర్చాకూడదని,ఇది వరకు ఎవరైతే బీసీ సర్టిఫికెట్స్ ను పొంది ఉంటే వెంటనే వాటిని రద్దు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్స్ ను ఏ ప్రతిపదికన ఇచ్చారో స్పష్టముగా తెలియజేయాలి అలాగే రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం కాబట్టి వెంటనే వాటిని రద్దు చెయ్యాలన్నారు. కేంద్రములో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖ ను కూడా ఏర్పాటు చెయ్యాలి ఎస్డీ,ఎస్టీ  లకు ఎలాగైతే ప్రతేక చట్టం ఉందో బీసీ అట్రాసిటీ చట్టం వెంటనే అమలు చెయ్యాలని కోరారు.బీసీ కులాలలో చేతి వృత్తి కులాలవారికి గౌడ్ ముదిరాజ్ చేనేత వారియొక్క ప్రమాద బీమా రూ.6 లక్షల నుండి రూ.10 లక్షల వరకు పెంచి బీసీ ఉపకులావృత్తులందరికి వర్తింపచెయ్యాలని, అలాగే బీసీ ఫెడరేషన్ కులాలందరికి ప్రత్యేకంగా కార్పారేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం రూ.1000 కోట్లు విడుదల చెయ్యాలని. బిసి కులాల చేతివృత్తుల బీసీ ఉపకులందరికి 50 సంవత్సరాలు పైబడిన వాళ్లందరికీ నెలసరి పింఛన్ రూ.5000 వర్తింపజేయాలన్నారు.తెలంగాణ రాష్ట్రములో బీసీ కులాల వెనుకబడిన వారు 56% శాతం జనాభా ఉన్నారు కావున వారిని గ్రామ స్థాయిలో పూర్తిగా వారియొక్క స్థితి గతులపై అధ్యయనం చేసి ఇపుడు మొదలయ్యే సమగ్ర సర్వే ద్వారా వారి యొక్క స్థితి గతులను తెలుసుకొని బీసీ ఉప కులాలకు సమగ్రన్యాయం చెయ్యాలని, అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ప్రాణా త్యాగాలు చేసిన బీసీ ఉప కులాల యొక్క కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.