లెబనాన్‌పై దాడుల్లో 52మంది మృతి

తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ ఆర్మీ జరిపిన దాడుల్లో 52మంది మరణించగా, 72మంది గాయపడ్డారు. లెబనాన్‌లోని ఈశాన్య ప్రాం– దీటుగా జవాబు చెబుతాం : ఖమేని ఎర్ర సముద్ర తీరంలో ఇరాక్‌ డ్రోన్‌ దాడులు
– కంటి తుడుపు చర్చలేనన్న హమాస్‌
గాజా/ బీరుట్‌ : తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ ఆర్మీ జరిపిన దాడుల్లో 52మంది మరణించగా, 72మంది గాయపడ్డారు. లెబనాన్‌లోని ఈశాన్య ప్రాంతంలోని గ్రామాల్లో ఇజ్రాయిల్‌ ముమ్మరంగా వైమానిక దాడులకు పాల్పడింది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న తరుణంలో ఇజ్రాయిల్‌ ఈ దాడులకు తెగబడింది. ఖాన్‌ యూనిన్‌ పట్టణంలో 20మంది వున్న ఇంటిపై దాడి జరగడంతో తొమ్మిది మంది మరణించారు. అమజ్‌ పట్టణంలో జరిగిన దాడిలో 12మంది మరణించారు. ఈశాన్య ప్రాంతంలోని 12కి పైగా గ్రామాల్లో జరిగిన పలు దాడుల్లో 31మంది చనిపోయారు. మొత్తంగా ఈ దాడుల్లోనే 52మంది మరణించారని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. దాంతో కుటుంబాలకు కుటుంబాలు చేతికందిన దాన్ని పట్టుకుని భయంతో దట్టమైన ఆ పొగలు, విధ్వంసం మధ్యనే ఆ ప్రాంతాన్ని వీడి వచ్చేస్తున్నారు. ఇప్పటివరకు లెబనాన్‌పై దాడులతో దాదాపు 14లక్షల మంది నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్య సమితి సంస్థలు అంచనా వేశాయి.
కంటి తుడుపు చర్చలు : హమాస్‌
కాల్పుల విరమణ చర్చలు కంటి తుడుపు చర్య మాత్రమేనని హమాస్‌ విమర్శించింది. గాజాపై దాడులు కొనసాగించేందుకు అవసరమైన సమయం కోసం ఈ చర్చల పేరుతో నెతన్యాహు తమకు కావాల్సిన సమయాన్ని తీసుకుంటున్నారని హమాస్‌ ప్రతినిధి సామి అబూ జుహారీ విమర్శిం చారు. ఇజ్రాయిల్‌ దురాక్రమణను నిలువరి ంచడం, బలగాల ఉపసంహరణ, నిర్వాసితులైన పాలస్తీనియన్లను తిరిగి మాతృ దేశానికి రప్పించడం వంటి ప్రతిపాదనలేవీ కాల్పుల విరమణ ప్రతిపాదనల్లో లేవని ఆయన విమర్శించారు. పాలస్తీనియన్లకు ఎంతగానో అవసరమైన భద్రత, సుస్థిరత, స్వాంతన, పునర్నిర్మాణం వంటి అంశాలేవీ ఈ ప్రతిపాదనల్లో వుండడం లేదని హమాస్‌ సీనియర్‌ అధికారి బాసెమ్‌ నయీమ్‌ విమర్శించారు.
దీటుగా బదులిస్తాం: ఖమేనీ
తాజాగా ఇజ్రాయిల్‌ జరిపిన దాడికి దీటుగా బదులిస్తామనిఇరాన్‌ మత పెద్ద ఆయతుల్లా అలీ ఖమేని అన్నారు. ఇజ్రాయిల్‌ దురాక్రమణపూర్తి దాడులు అంతకంతూ విస్తరించి, పశ్చిమాసియా ప్రాంత యుద్ధంగా దీనిని మార్చాలని అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చూస్తున్నాయి. ఖమేని ప్రసంగ వీడియోను ఇరాన్‌ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. దాడి ఎప్పుడు చేసేది వెల్లడించలేదు. దక్షిణ ఇజ్రాయిల్‌లో ఎర్ర సముద్రం తీరంలో ఇలట్‌ రిసార్ట్‌పై నాలుగు డ్రోన్‌ దాడులు జరిపినట్లు ఇరాక్‌లోని సంకీర్ణ గ్రూపులు ప్రకటిం చాయి. కీలకమైన లక్ష్యాలపైనే దాడి చేసినట్లు పేర్కొన్నాయి.
గాజా దాడుల్లో 20మంది మృతి
ఉత్తర గాజాలో చిక్కుకున్న 4వేల మంది గర్భిణులు
గాజాలో శనివారం తెల్లవారుజాము నుండి జరిగిన దాడుల్లో 20మంది మరణించారు. దాడుల తర్వాత విధ్వంసం చాలా తీవ్రంగా వుందని అక్కడి మీడియా బృందాలు పేర్కొన్నాయి. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో 20మంది పాలస్తీనియన్లను ఇజ్రాయిల్‌ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క ఉత్తర గాజా దిగ్బంధనం ఇప్పటికి గత నాలుగు వారాలుగా కొనసాగుతోంది. దాదాపు నాలుగు వేల మంది గర్భిణులు ఆ ప్రాంతంలో చిక్కుకుపో యారని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి (యుఎన్‌ఎఫ్‌పిఎ) పేర్కొంది.