కుల గణనతో న్యాయం

Justice with caste enumeration– కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు గడ్డం క్రాంతి
నవతెలంగాణ – మల్హర్ రావు
కుల గణనతో అన్ని కులాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా కుల గణన చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆరు గ్యారెంటీల చైర్మన్ దుద్దిళ్ల శ్రీదర్ బాబుల సూచనలతో తెలంగాణలో సరికొత్త విధానంతో ఈనెల 6 నుంచి సమగ్ర ఇంటింటా సర్వే చేయడానికి సిద్ధమైనట్లుగా తెలిపారు. దీనికి సంబంధించిన అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తిస్థాయిలో అయినట్లుగా తెలిపారు. కుల చేయడం వలన ఎస్సి,ఎస్టీ, బీసీల్లో పెనుమార్పులు రాబోతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.