నవతెలగాణ – తొగుట
యాదవుల సాంస్కృతిక సమ్మేళనం సదర్ ఉత్స వమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి మండలంలోని కాన్గల్ గ్రామంలో జరిగిన సదర్ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దీపావళి పండుగ తర్వాత సదర్ ఉత్సవం ను గతంలో జంట నగరాల్లో ఘనంగా జరుపుకునే వారని, నేడు గ్రామాల్లో జరుపుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో సదర్ జరుపుకుంటున్న రెండో గ్రామంగా కాన్గల్ నిలిచిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవం ఏర్పాటు చేసిన యాదవ సోదరులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో యాదవ సంఘం నిర్వాహకులతో పాటు మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, వైస్ ఎంపీపీ బసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, నాయకులు ముడికే కనకయ్య, స్వామి, గణేష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.