నవతెలంగాణ – అచ్చంపేట
శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరుగాంచిన మండల పరిధిలోని ఉమామహేశ్వర దేవాలయం అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని ఎక్సైజ్ శాఖ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం రూ.1కోటి 20 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఉమామహేశ్వరం కార్యక్రమంలో పాల్గొనే ముందు రూ.50 లక్షలు నిధులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన మాట ప్రకారంగా రూ.50 లక్షలను సాంక్షన్ చేసినట్లు గుర్తు చేశారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో పకృతి ఇచ్చిన అందమైన వాతావరణాన్ని పర్యాటకుల కోసం మరింత అభివృద్ధి చేస్తామన్నారు. పురాతనమన దేవాలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి నూతల పర్యాటకులను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలోని అక్కమాదేవి గృహాలు, కదిలివనం, మల్లెల తీర్థం సలేశ్వరం ,లొద్ది మల్లయ్య, అంతర్గంగా, మద్దిమడుగు ఇలా 15 పురాతన పేరుగాంచిన ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఉన్నాయి. వాటిని పర్యాటక కేంద్రంగా మార్చాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మద్దిమడుగు సమీపంలోని కృష్ణా నది పైన వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా లెటర్ రాసినట్లు తెలిపారు. భూత్పూర్ నుంచి మద్దిమడుగు నేషనల్ హైవేను విస్తరించే విధంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని అన్నారు. అనుమతులు రాగానే పనులు జరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఉమామహేశ్వరం క్షేత్రం కొండ కింద రూ.10 కోట్ల రూపాయలతో టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన గెస్ట్ హౌస్ నిరుపయోగంగా ఉంది. వాటిని లీజుకి ఇచ్చి, పర్యాటకులకు వసతి సౌకర్యాలకు అనుకూలంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో దేవస్థానం కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గంగాపురం రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ చైర్మన్ రజిత మల్లేష్, విజయ డైరీ చైర్మన్ నర్సయ్య యాదవ్, నాయకులు గోపాల్ రెడ్డి రామనాథం తదితరులు ఉన్నారు.