అందమైన గ్రామీణ నేపథ్య కథ

beautiful Rural background storyవిప్లవ్‌ దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘ఈసారైనా’. ఈ సినిమా ఈ నెల 8న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో విప్లవ్‌ మాట్లాడుతూ, ‘అందమైన గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతూ ఒక నిరుద్యోగ యువకుడు అతని ప్రేమను వెతుక్కునే దిశగా ఎలా సాగుతాడు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా మీ అందరి ముందుకు రావడానికి కారణం సంకీర్త్‌. మొదట్నుంచీ ఆయన మమ్మల్ని బాగా ఎంకరేజ్‌ చేసారు. ఈ సినిమాకి నేనే ప్రొడ్యూసర్‌ని. అన్నింటినీ కష్టమైనా మేనేజ్‌ చేశాను. టీజర్‌, సాంగ్స్‌ అన్నీ చూడండి. నచ్చితే, సినిమా చూడండి’ అన్నారు.
‘శిరీష క్యారెక్టర్‌ నాతో చేయించిన విప్లవ్‌కి కృతజ్ఞతలు. నా ఫస్ట్‌ సినిమాకి ఇలాంటి క్యారెక్టర్‌ రావడం సంతోషంగా ఉంది. ఇది సినిమా మాత్రం కాదు. ఒక ఎక్స్‌పీరియన్స్‌ అని చెప్పొచ్చు’ అని హీరోయిన్‌ అశ్విని చెప్పారు. కో ప్రొడ్యూసర్‌ సంకీర్త్‌ మాట్లాడుతూ, ‘నా దష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఏమి ఉండదు. ఒక సినిమా మనతో పాటు ఇంటికి వచ్చిందంటే, అది అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో కూడా అందరూ ఫీల్‌ గుడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ పొందుతారు’ అని తెలిపారు. ప్రదీప్‌ రాపర్తి, మహబూబ్‌ బాషా, కార్తికేయ దేవ్‌, నీతు క్వీన్‌, సత్తన్న, అశోక్‌ మూలవిరాట్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత: విప్లవ్‌, సహ నిర్మాత: సంకీర్త్‌ కొండా, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: విప్లవ్‌, సంగీతం: తేజ్‌, డి ఓ పి: గిరి, ఎడిటింగ్‌: విప్లవ్‌, కళ: దండు సందీప్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అభినరు కొండ, లైన్‌ ప్రొడ్యూసర్‌: పూర్ణిమ రెడ్డి.