డిక్సన్‌ టెక్నాలజీతో సెల్లెకార్‌ గాడ్జెట్స్‌ భాగస్వామ్యం

హైదరాబాద్‌ : వాషింగ్‌ మెషీన్‌లను తయారు చేయడానికి డిక్సన్‌ టెక్నాలజీస్‌ (ఇండియా) లిమిటెడ్‌తో సెల్లెకార్‌ గాడ్జెట్స్‌ భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు వెల్లడించింది. దీంతో గృహోపకరణాల విభాగంలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి దోహదం చేయనుందని పేర్కొంది. ఈ భాగస్వామ్యం కింద సెల్లెకార్‌ కోసం అనేక రకాల వాషింగ్‌ మెషీన్‌లను తయారు చేయనున్నట్లు డిక్సన్‌ తెలిపింది. ఇందుకోసం విస్తృత స్థాయి నైపుణ్యం, అత్యాధునిక సౌకర్యాలను ఉపయోగించుకోనున్నట్లు పేర్కొంది. వినియోగదారుల డ్యూరబుల్స్‌, లైటింగ్‌, మొబైల్‌ ఫోన్‌ల తయారీలో డిక్సన్‌ ఉంది.