– పార్థవి, గోస్వామి, హేమంత్‌లకు స్వర్ణాలు
– అండర్-19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్
కొలరాడో (యుఎస్‌ఏ) : అండర్-19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో యువ భారత్ అదరగొట్టింది. టీమ్ ఇండియా నుంచి పోటీల్లో 19 మంది బాక్సర్లు బరిలోకి దిగగా.. ఏకంగా 17 బాక్సర్లు పతకాలు కొల్లకొట్టారు. కృష్ణ వర్మ పసిడితో మెరువగా.. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో మరో ముగ్గురు బాక్సర్లు స్వర్ణాలు సాధించారు. మహిళల 65 కేజీల విభాగంలో పార్థవి గ్రెవల్, మహిళల 80 కేజీల విభాగంలో వెన్సిక గోస్వామి, మెన్స్ 90 కేజీల విభాగంలో హేమంత్ సంగ్వాన్‌లు పసిడి పంచ్ విసిరారు. మహిళల విభాగంలో నిష (51 కేజీలు), సుప్రియ దేవి (54 కేజీలు), క్రితిక వాసన్ (80 కేజీలు), చంచల్ చౌదరి (48 కేజీలు), అజంలి సింగ్ (57 కేజీలు), విని (60 కేజీలు), ఆకాంశ (70 కేజీలు) సిల్వర్ మెడల్స్ సాధించారు. మెన్స్ విభాగంలో రాహుల్ (75 కేజీలు) రతజంతో మెరువగా.. రిషి సింగ్ (50 కేజీలు), క్రిశ్ పాల్ (55 కేజీలు), సుమిత్ (70 కేజీలు), ఆర్యన్ (85 కేజీలు), లక్ష్యరు (90 కేజీలు) కాంస్య పతకాలు దక్కించుకున్నారు. వరల్డ్ బాక్సింగ్ నిర్వహించిన తొలి టోర్నమెంట్‌లో పతకాల పంట పండించిన భారత్ మహిళల విభాగంలో ఓవరాల్ రన్నరప్‌గా నిలిచింది.