‘నేను ఎప్పటినుంచో వాస్తవానికి దగ్గరగా ఉండే ఒక మధ్యతరగతి తండ్రి పాత్ర చేయాలని అనుకుంటున్నాను. అది ‘లక్కీభాస్కర్’ సినిమాతో నెరవేరింది’ అని హీరో దుల్కర్ సల్మాన్ చెప్పారు. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ఆయన నటించిన చిత్రం ‘లక్కీభాస్కర్’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి సర్వత్రా మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో సోమవారం హీరో దుల్కర్‌సల్మాన్ మీడియాతో మాట్లాడుతూ, ‘దర్శకుడు వెంకీ కథ చెప్పినప్పుడు బ్యాంకింగ్ నేపథ్యాన్ని తీసుకొని మధ్యతరగతి కుటుంబ కథగా చెప్పడం కొత్తగా అనిపించింది. నా దష్టిలో ఇది వాస్తవ కథ. ఇదే ఈ సినిమా ప్రత్యేకత. నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నాయి. ఇలాంటి పాత్రలు చేసినప్పుడే సంతృప్తి లభిస్తుంది. తెలుగులో ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నాను’ అని అన్నారు.