పావ్న ఇండిస్టీస్‌ పెరిగిన అమ్మకాలు

హైదరాబాద్‌ : ఆటోమొటివ్‌ విడిభాగాల తయారీ సంస్థ పావ్న ఇండిస్టీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో 9.94 శాతం వృద్థితో రూ.83.73 కోట్ల నికర అమ్మకాలు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.76.16 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఇదే సమయంలో కంపెనీ నికర లాభాలు రూ.2.62 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ2లో 4.59 శాతం పెరిగి రూ.2.74 కోట్లకు చేరాయి.