
గురుకుల విద్యార్థులకు ఇచ్చే డైట్ కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచడాన్ని హర్శిస్తూ మంగళవారం స్థానిక గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ సైదా జైనాబ్, వైస్ ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.