కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటా కుటుంబ సర్వేలో, మండల వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ అన్నారు. మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం వల్ల, సామాజిక ఆర్థిక కుల సర్వేతో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేత అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ సర్వే తో ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరుతాయన్నారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ చైర్మన్లు, మాజీ సర్పంచులు డైరెక్టర్లు గ్రామ కమిటీ అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు యువజన సంఘాల నాయకులు అందరూ పాల్గొని ఈ సర్వేను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.