సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్’. రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్య తారలుగా సింగిల్ సెల్ యూనివర్శ్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ మీడియాతో ముచ్చటించారు. ‘మా నాన్న స్టేజీ షోలకు రైటర్. అమ్మ కూడా కవితలు రాస్తుండేవారు. మా ఇంటి వాతావరణం నుంచే నాకు సినిమాలపై ఆస్తక్తి పెరిగింది. చాలా షార్ట్ ఫిలింస్ చేశాను. పలు అవార్డులు కూడా దక్కాయి. ఇక సినిమా తీయగలను అనే నమ్మకం వచ్చిన తరువాత ఈ సినిమాకి డైరెక్ట్ చేశాను. బ్యూటీఫుల్ కంటెంట్, వండర్‌ఫుల్ విజువల్స్, టెక్నికల్‌గా చాలా సౌండ్‌తో ఈ సినిమా చేశాను. దర్శకుడిగా ఒక వైవిధ్యమైన కొత్త కథలో రావాలని అనుకున్నాను. ఆ సమయంలోనే ఈ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇండియాకు చెందిన శ్రీ చక్రం గురించి అమెరికాలో అన్వేషణ జరిగింది. శ్రీ చక్రం గురించి తవ్వకాలు జరిగిన ప్రదేశం నేను ఉండే ప్లేస్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. శ్రీ చక్రం కోసం జరిగిన అన్వేషణ నన్ను బాగా ఇన్‌స్పైయిర్ చేసింది. దీంతోపాటు వామ్ హోల్ కాన్సెప్ట్‌తో ఇతర లోకాలకు ట్రావెల్ కావొచ్చు అని చెప్పే కథ కూడా ఇది. ఈ కథలో ఆడియన్స్ బాగా థ్రిల్ల్‌గా ఫీలయ్యే అంశాలు చాలా ఉన్నాయి. ఈ జగతే ఒక రహస్యం, అందులో మేము టచ్ చేసింది చిన్న పాయింట్. అయితే ఈ పాయింట్‌ని ఎవ్వరూ టచ్ చేయలేదు’.