యుద్ధవేట

huntingఇంకా యుద్ధం మిగిలే ఉంది
ఆహారవేటకు ఆయుధాలు కానీ
మనుషుల వేటకు ఎందుకు?

ఎంతగా తరచి చూసినా…
సాటి మనిషిని వేటాడే యుద్ధమూలం
ఆధిపత్యమే… జాత్యాహంకారమే
మత విద్వేషమే…
క్రూరదోపిడీ ముసుగే
సరిహద్దుల పరిధిదాటి
పౌరసమాజ ప్రాణహననం
యుద్ధవేట కాదా?

మనుషుల మధ్య సయోధ్యకు
ఉత్పత్తి సాధపమైతే
దోపిడీకి సాధనం యుద్ధవేటే

బానిసయుగం కన్నా ఘోరం
ఆధునిక ముసుగు క్రౌర్యం

జాగులేదిక
ఉగ్గు పాలతోనే
శాంతిని సామరస్యాన్ని
రంగరించి పోయాలి
యుద్ధవేటకు చరమగీతం పాడాలి
విశ్వమానవులుగా మనం మిగలాలి.

– కె.శాంతారావు, 9959745723