ఆ రోజు పండగే..

That day is a festival..నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీ వాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని అధికారికంగా అనౌన్స్‌ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ సాయి పల్లవి మాట్లాడుతూ,’మంచి కంటెంట్‌ ఎప్పుడు వచ్చినా అది జనాలకి కచ్చితంగా నచ్చేస్తుంది. ఈ సినిమా అందరికీ నచ్చాలని కోరుకుంటాను. చాలా ఎఫర్ట్‌ పెట్టి సినిమా చేశాం’ అని తెలిపారు. నిర్మాత బన్నీ వాస్‌ మాట్లాడుతూ,’సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అక్కినేని అభిమాను లందరూ కాలర్‌ ఎగరేసేలా ఉంటుంది. చైతన్య ‘100% లవ్‌’ సినిమాలో ఫస్ట్‌ టైం నిర్మాతగా నా పేరు వేసిన వ్యక్తి. దానికి బదులుగా నేను ఈ సినిమాను తీసుకెళ్లి 100 కోట్ల క్లబ్‌లో కూర్చోబెడతానని మాట ఇస్తున్నాను’ అని అన్నారు. డైరెక్టర్‌ చందూ మొండేటి మాట్లాడుతూ,’ఈ సినిమాకి ది బెస్ట్‌ రెవిన్యూ, నెంబర్స్‌ మనం చూడబోతున్నాం’ అని తెలిపారు. నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ,
‘ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ చెప్పడం మాకు ఎంతో ప్రత్యేకం. ఫిబ్రవరి 14వ తేదీ ఇంపార్టెన్స్‌ మనకు తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న మీ ముందుకు తీసుకొస్తున్నాం’ అని చెప్పారు. శ్రీకాకుళంలో కొంతమంది మత్స్యకారుల జీవితమే ఈ సినిమా. వారి కష్టం దేశం అంతా షేక్‌ చేసింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ చేసినా అది పండగే అవుతుంది. నన్ను తెరపై నెక్స్ట్‌ లెవెల్‌లో చూపించాలని డైరెక్టర్‌ చాలా కష్టపడ్డారు. ఫిబ్రవరి 7.. దుల్లకొట్టేదాం.
– హీరో నాగ చైతన్య