
మండలంలో రైతులు దళారులకు దాన్యం విక్రయించి నష్టపోవద్దని నాగార్జునసాగర్ ఏంఎల్ ఏ కుందూరు జయవీర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని సబ్ మార్కెట్ యాడ్ లో దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలని ఆయన రైతులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఏ గ్రేడ్ రకానికి రూ.2320, బీ గ్రేడ్ కు రూ.2,300 తో పాటు రూ.500 బోనస్ పొందాలని తెలిపారు. గ్రామాల్లో దళారులకు అమ్మకుండా ధాన్యాన్ని ఆరబెట్టి 17 శాతం తేమ ఉండేలా సూసుకొని కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని అన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, మార్కెట్ ఛైర్మెన్ తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డి,వైస్ ఛైర్మెన్ చంద్రశేఖర్, పీఏసీఎస్ ఛైర్మెన్ గుంటుక వెంకట్ రెడ్డి, కర్నాటి నార్సిహ్మా రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పబ్బుయాదగిరి, మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు చామల సువర్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు గడ్డంపల్లి వినయ్ రెడ్డి,ఎంపీడీఓ ఉమాదేవి, తహసీల్దార్ సరోజ పావని, ఏఓ సందీప్ రెడ్డి, సీఈఓ వాడిరెడిడ్డి వెంకట్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు వూరే వెంకన్న, లక్షమయ్య, తదితరులు పాల్గొన్నారు. …