సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలి: ఎంపీడీఓ

People should contribute to comprehensive family survey: MPDOనవతెలంగాణ – మోపాల్ 

బుధవారం మోపాల్ మండల కేంద్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే స్టిక్కరింగ్ చేసి, పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి ఇంటినీ పరిశీలించాలని ఎంపీడీఓ రాములు నాయక్ తెలిపారు. గ్రామస్తులందరూ ఏన్యుమారెటర్లు అడిగిన వివరాలను ఇచ్చి, సమగ్ర ఇంటింటి సర్వేకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి గోవింద్ రావు, మండల అభివృద్ధి అధికారి రాములు, పంచాయతీ కార్యదర్శి మధు సుదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.