ప్రపంచ పర్యాటక దినోత్సవంలో నల్లమల్ల టూరిజంపై చర్చ

Discussion on Nallamalla Tourism on World Tourism Dayనవతెలంగాణ – అచ్చంపేట
లండన్ లో ప్రపంచ పర్యటక దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు,  గద్వాల, అచ్చంపేట, కల్వకుర్తి ఎమ్మెల్యేలు ఆ దేశంలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలోని పేరుగాంచిన పర్యాటక ప్రదేశాల గురించి లండన్ పర్యాటకులకు మంత్రి, ఎమ్మెల్యేలు వివరించారు. ప్రధానంగా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల్ల అటవీ ప్రాంతం టైగర్ సఫారీ, కృష్ణా నది పరవళ్ళు, మరెన్నో పురాతన అద్భుతమైన ఆలయాల చరిత్రపై, పకృతి సహజసిద్ధంగా ఏర్పడిన పర్యాటక ప్రాంతాల గురించి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ వివరించారు. మద్దిమడుగు ప్రాంతంలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కలిపే  కృష్ణ నది వంతెనపైన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు తెలిపారు. అదేవిధంగా కొల్లాపూర్ నియోజక వర్గంలోని సోమశిల ప్రాంతంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధునాతనమైన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పనులు చురుకుగా జరుగుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం టూరిజం హబ్ పేరుతో నల్లమల ప్రాంతాన్ని అభివృద్ధి చేయగా ముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రి కృషి చేస్తున్నట్లు వివరించారు. లండన్ పర్యాటకులు తెలంగాణ ప్రాంతంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటక కేంద్రాలను సందర్శించడం ద్వారా పర్యాటకుల మదిలో చిరస్థాయిగా గుర్తుండిపోతాయని తెలిపారు.