
సతీష్ మాట్లాడుతూ, లచ్చపేటలోని సర్వే నంబర్ 26లో తమకు వారసత్వంగా సంక్రమించిన 10 ఎకరాల వ్యవసాయ భూమిని కొందరు కబ్జాదారులు రిజిస్ట్రేషన్,మున్సిపల్ ఆఫీసర్ల సహాయంతో తమ భూమిలో నుంచి 1805 గజాల స్థలాన్ని ఫోర్జరీ,ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. తమ భూమిలో అంగుళం కూడా ఎవరికీ అమ్మలేదన్నారు.సిరిసిల్లకు చెందిన ఎర్రగుంట భరత్ అనే వ్యక్తి తమకు చెందిన భూమిలో నుంచి 1805 గజాల ఓపెన్ ల్యాండ్ ను అసెస్మెంట్ కాపీ,రివిజన్ రికార్డులో వారి పేరు లేకున్నా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని.. అందుకు అప్పటి రిజిస్ట్రేషన్ అధికారులు సహకరించారని ఆరోపించారు. పలుమార్లు మున్సిపల్ ,రెవెన్యూ, రిజిస్ట్రే షన్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం,జిల్లా కలెక్టర్ తమ మొరను ఆలకించి తమ భూమిని తమకు ఇప్పించి అక్రమార్కులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.నందాల శ్రీకాంత్,హరీష్,మహేష్ ఉన్నారు.