
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మండల పరిధిలోని తుక్కాపూర్ ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద సోషల్ మీడియా మండల కన్వీనర్ చిక్కుడు స్వామి, గ్రామ కార్యదర్శి చిక్కుడు గోపా ల్ రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్య క్రమంలో వివో బరెంకల లక్ష్మి, భవాని రేణుక తది తరులు పాల్గొన్నారు.