రిమ్స్ లో ఈనెల 11 ఉచిత గ్రహణం, మొర్రి, వైద్య శిబిరం

11th of this month free eclipse, morri, medical camp in Rimsనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఈనెల 11న 0-18 సంవత్సరాలు గల పిల్లలకు ఆర్బీఎస్కే, డీఈఐసీ ఆధ్వర్యంలో గ్రహణం మొర్రి, పెదాల చీలిక, అంగిలి చీలిక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్, ఆర్బీఎస్కె  సమన్వయ కర్త డా.శ్రీనివాస్ వైసి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంబందిత వ్యాధులకు ఏవిఆర్ హాస్పిటల్ హైదరాబాద్ వైద్యులు బృందంతో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రిమ్స్ లోని అవుట్ పేషెంట్ బిల్డింగ్ రెండో అంతస్థు గది, నంబర్ 46లో ఈ శిబిరం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ పర్యావేక్షణలో జరుగుతుందని పేర్కొన్నారు. కావున ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.