స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా సత్యనారాయణ గౌడ్.. పలువురు సన్మానం

నవతెలంగాణ-ఆర్మూర్  : స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా శుక్రవారం సత్యనారాయణ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరించినారు. గత జనవరి 31 నుండిఇక్కడ పనిచేసిన రవికుమార్  11 నెలల పాటు పని చసినారు . డి ఐ జి కార్యాలయం నుండి వచ్చిన   సత్యనారాయన్ గౌడ్ కి జిజి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసినారు. ఈ సందర్భంగా జి జి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి  మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతలను కాపాడుతూ, ప్రజా సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తూ  న్యాయం చేయాలని అదేవిధంగా పట్టణంలోని ప్రధాన ట్రాఫిక్ సమస్య పై దృష్టి సాధించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ మాజీ అధ్యక్షులు డీజే దయానంద్, జేస్సు ఆనంద్, మెడికల్ అసోసియేషన్ మాజి అధ్యక్షులు అల్జాపూర్ రాజేశ్వర్, సినియర్ సిటిజన్ అధ్యక్షులు నారాయన్ వర్మ, రాంప్రసాద్, రాజేందర్, డీజే వికాస్ తదితరులు పాల్గొన్నారు.