ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

నవతెలంగాణ-ఆర్మూర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జన్మదినం సందర్భంగా శుక్రవారం  పట్టణం లోని   సీకన్వెన్షన్ హాల్ లో జన్మదిన వేడుకలను నిర్వహించినారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు. పట్టణంలోని డిఫ్ఫెండమ్ పాఠశాలలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం తో సిద్దుల గుట్ట యందు వసతి గృహాల కోసం భూమి పూజ నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి,  ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హంధన్  ,మాజి గ్రంథాలయ చైర్మన్ మార చంద్ర మోహన్ ,మున్సిపల్ చైర్ పర్సన్ అయ్యప్ప శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఎస్ కె బబ్లు తదితరులు పాల్గొన్నారు.