నవతెలంగాణ – చండూరు
చండూరు మండలంలోని బోడంగిపర్తి గ్రామంలో కొలువై ఉన్న పద్మావతి అలివేలుమంగా సమేత శ్రీవెంకటేశ్వర స్వామి వారి 21వ ఎక వింశతి బ్రహ్మోత్సవ వేడుకలు ఈనెల 9న శనివారం ప్రారంభమై 11వ తేది సోమవారం వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగునట్లు మంచి కంటి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ మంచికంటి వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 11న స్వామి వారి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. గత 21సంవత్సరాల నుండి స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహింస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామి వారి తిరు కళ్యాణమహోత్సవం జరుగుతుందని అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో వచ్చి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని ఆయన కొరారు.