రాజస్థాన్‌దే పైచేయి!

Rajasthan has the upper hand!– హైదరాబాద్‌, రాజస్థాన్‌ రంజీ పోరు
జైపూర్‌ : రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బి మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్యాటర్లు, బౌలర్లు సమిస్టిగా రాణించినా.. రాజస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో విలువైన ఆధిక్యం దక్కించుకుంది. మహిపాల్‌ (111, 150 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు), శుభమ్‌ (108, 107 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీలతో కదం తొక్కారు. అభిజిత్‌ తోమర్‌ (60), జుబెర్‌ అలీ (57) సైతం రాణించటంతో రాజస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 108.2 ఓవర్లలో 425 పరుగులు చేసింది. తనరు త్యాగరాజన్‌ (3/104), సివి మిలింద్‌ (2/73), రోహిత్‌ రాయుడు (2/65) కీలక వికెట్లు తీసుకున్నారు. హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
మూడో రోజు ఆట ముగిసే సరికి హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లలో 36/0తో కొనసాగుతోంది. తన్మరు అగర్వాల్‌ (8 నాటౌట్‌), అభిరాత్‌ రెడ్డి (28 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నారు. నేడు చివరి రోజు ఆటలో 20 వికెట్లు పతనం అయ్యే అవకాశాలు లేకపోవటంతో.. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రాజస్థాన్‌ కీలక పాయింట్లు సొంతం చేసుకోనుంది!.