సంక్రాంతికి వస్తున్నాం..

Coming to Sankranti..వెంకటేష్‌, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రూపొందు తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. యూనిక్‌ ట్రైయాంగ్లర్‌ క్రైమ్‌ డ్రామాగా  దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. రీసెంట్‌గా ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చిందని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు  చేరుకుంది. తాజాగా ఫైనల్‌ షెడ్యూల్‌ అరకులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మేకర్స్‌ రిలీజ్‌ చేసిన వీడియోలో స్కూల్‌ స్టూడెంట్స్‌ హీరో వెంకటేష్‌కి సాదరంగా స్వాగతం  పలకడం, ఆయన ఆప్యాయంగా వారిని పలకరించడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దిల్‌ రాజు  సమర్పణలో శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్‌, సాయి కుమార్‌,  నరేష్‌, వీటీ గణేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, డీవోపీ: సమీర్‌ రెడ్డి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌.ప్రకాష్‌, ఎడిటర్‌: తమ్మిరాజు, కో – రైటర్స్‌: ఎస్‌ కష్ణ, జి.ఆదినారాయణ, యాక్షన్‌ డైరెక్టర్‌: వి.వెంకట్‌.