– బహిరంగ విచారణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల నిష్పత్తి విషయమై స్పష్టత ఇచ్చేందుకు నియమించిన డెడికేటేడ్ కమిషన్ ఈనెల 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లోని సంక్షేమభవన్‌లో బహిరంగ విచారణ నిర్వహించనుంది. ఈ మేరకు డెడికేటేడ్ కమిషన్ కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ బహిరంగ విచారణలో కమిషన్ చైర్మెన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వర్ రావు పాల్గొననున్నారు. ఈనెల 11న సంక్షేమ భవన్ ఈ అంశంపై వినతులు, సలహాలు, సూచనలు, అభ్యంత రాలను తెలియజేసే అవకాశం ఉంది. దీనికి ఎవరైనా రావచ్చు. అలాగే ఈనెల 12న అదే సంక్షేమభవన్‌లో ఎన్జీవోలు, సంస్థలు, కుల, సంక్షేమ సంఘాలు వచ్చి తమ అభిప్రాయాలను కమిషన్ చైర్మెన్‌కు చెప్పవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు కమిషన్ సూచించింది.