నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
2025 సంవత్సరంలో ప్రభుత్వ సాధారణ సెలవులు, ఐచ్చిక సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది మొత్తం 27 సాధారణ సెలవులు కాగా, 23 ఐచ్చిక సెలవులు. జనవరి1 సాధారణ సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం ఫిబ్రవరి 8 రెండో శనివారాన్ని వర్కింగ్ డే గా పేర్కొంది. అది మినహా అన్ని సెకండ్ సాటర్డేలు, ఆదివారాలను సెలవుగా పేర్కొంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జివొ నెంబర్ 1479 విడుదల చేశారు.