సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఒక ప్రకటన లో తెలిపారు. జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే – సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ని రద్దు చేయడం జరిగిందనీ అన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో ప్రజలు సిబ్బందికి సహకరించి సమగ్ర సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేయడం జరిగిందనీ, ప్రజలు దీనిని గమనించి కలెక్టరేట్ కార్యాలయానికి రావద్దని కోరారు.