పట్నా పైరెట్స్‌ ఘన విజయం

Great win for Patna Pirates– ప్రొ కబడ్డీ సీజన్‌-11
లక్నో: ప్రొ కబడ్డీ సీజన్‌-11లో పట్నా పైరెట్స్‌ తన జోరును కొనసాగిస్తోంది. సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో పట్నా జట్టు 40-27పాయింట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. పట్నా జట్టులో అయాన్‌(10), దేవాంక్‌(6) రైడ్స్‌లో రాణించగా.. సందీప్‌(5), దీపక్‌(4) ట్యాకిల్స్‌లో మెరిసారు. ఇక గుజరాత్‌ జట్టులో పార్థీక్‌(5), గుమన్‌(5) రైడ్స్‌లో రాణించగా.. ట్యాకిల్స్‌లో రాకేశ్‌(4), మోహిత్‌(4) మాత్రమే రాణించారు. పట్నా జట్టు నాలుగుసార్లు గుజరాత్‌ను ఆలౌట్‌ చేయగా.. రైడ్‌ల రూపంలో 19, ట్యాకిల్స్‌ ద్వారా 14పాయింట్లు సాధించింది. ఈ గెలుపుతో పట్నా 7మ్యాచుల్లో 22పాయింట్లతో 7వ స్థానానికి ఎగబాకింది.