సీసీఐ కేంద్రాల వద్ద యధాతథంగా కొనుగోళ్లు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీసీఐ విధించిన నిబంధన సంబంధించిన జిన్నింగ్‌ మిల్లుల యజమానులు లేవనెత్తిన అంశాలపై చర్చించి పరిష్కరించిన నేపథ్యంలో మంగళవారం నుంచి సీసీఐ కేంద్రాల వద్దనే పత్తి కొనుగోళ్లు నిర్వహించనున్నట్టు మార్కెటింగ్‌ శాఖ సంచాలకులు ఉదరుకుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిన్నింగ్‌ మిల్లుల యజమానుల నిరసనల నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో రైతుల సంక్షేమం, ప్రాధాన్యతల దృష్ట్యా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సంచాలకులు ఉదరు కుమార్‌, సీసీఐ సీఎండీ లిలిత్‌ కుమార్‌ గుప్తాతో పాటు రాష్ట్ర కాటన్‌ జిన్నింగ్‌ మిల్లుల సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఇతర సభ్యులతో చర్చించారు. దీనిలో సీసీఐ విధించిన నిబంధనలపై జిన్నింగ్‌ మిల్లర్ల అభ్యంతరాలను చర్చించి పరిష్కరించినట్టు తెలిపారు. ఈ మేరకు పత్తి మార్కెట్లు, సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద యధాతథంగా కొనుగోల్లు నిర్వహించనున్నట్టు తెలిపారు.