ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

The collector inspected the grain purchase centresనవతెలంగాణ – రెంజల్
ప్రభుత్వ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయాలని రాజీవ్ గాంధీ హనుమంతు నిర్వాహకులకు ఆదేశించారు. సోమవారం రెంజల్ మండల కేంద్రంలోని ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ కేంద్రానికి రైతులు తరలించిన ధాన్యం నాణ్యతను ఆయన పరిశీలించారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యం 17% తేమ కలిగి ఉండేలా చూడాలన్నారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం సేకరించారాని, ఇంకా ఎంత ధాన్యం సేకరించే అవకాశం ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది ముందుగా కోతలు రావడంతో రైతులు పచ్చిధాన్యాన్ని దళారులకు గ్రహించడం జరిగిందని, అధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గత సీజన్ కంటే తక్కువ పరిమాణంలోని రైతులు ధాన్యం విక్రయించడానికి ముందుకు వచ్చారని ఆలస్యంగా పంట చేతికి వచ్చిన రైతులు మాత్రమే కొనుగోలు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారని వారన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. తాము సేకరించిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ఆయన వెంట డిఆర్డిఏ పిడి సాయి గౌడ్, తహసిల్దార్ శ్రవణ్ కుమార్, ఎంపీడీవో హెచ్. శ్రీనివాస్, డిపిఎం సాయిలు, ఎంపీ ఓ రఫీ అహ్మద్, ఏపీఎం చిన్నయ్య, సీసీ భాస్కర్, కంప్యూటర్ ఆపరేటర్ తస్లీమా, ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.