– చివరి గడువు ఈ నెల 21 వరకు
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లాలోని గాంధారి లోగల ఏకలవ్య గురుకులంలో పని చేయుటకు ఔట్ సోర్సింగ్ పద్ధతిన కాటరింగ్ అసిస్టెంట్ (01), మెస్ హెల్పర్ (05), శానిటేషన్ (02), ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్ (01), స్టాఫ్ నర్స్ (01) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేటరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. మెస్ హెల్పర్, శానిటేషన్ కోసం 10 వ తరగతి, ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్ పోస్టుకు 10 వ తరగతితోపాటు ఐటిఐ లేదా పాలిటెక్నిక్, స్టాఫ్ నర్స్ కొరకు బీఎస్సీ నర్సింగ్, జీయన్ఎం రెండున్నర సంవత్సరాలు అనుభవము వుండాలన్నారు. కనీసం 50 పడకల ఆస్పత్రిలో ఒక సంవత్సరంపాటు పని చేసిన అనుభవం వుండాన్నారు. దరఖాస్తులను ఈ నెల 21 లోపు గాంధారిలో ఏకలవ్య గురుకులంలో సమర్పించాలని తెలిపారు. నూతనంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో పదవ తరగతి పూర్తి చేసిన బోనాఫైడ్ గల అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. పూర్తి మెరిట్ ఆధారంగా నియామకాలు చేస్తామన్నారు. ఇవి పూర్తి తాత్కాలిక పోస్టులని, రెగ్యులర్ ఉద్యోగుల నియామకం కొరకు ఇది వరకే నోటిఫికేషన్ విడుదలైందన వీరి తొలగింపు ఏ క్షణంలోనైనా జరగవచ్చన్నారు. పూర్తి వివరాలకు గాంధారి ప్ప్రిన్సిపాల్ నెంబర్ 8005545951 సంప్రదించాలన్నారు.